Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో నయనతార తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నా హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇక సమంత వివాహానికి ముందు స్టార్ ఇమేజ్ గురించి పక్కన పెడితే వివాహం తర్వాత కూడా ఆమె పెద్దగా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేయలేదు. కానీ విడాకుల తర్వాత ఫ్రీ బర్డ్ గా మారిన సమంత వరుసగా సినిమాలు చేస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ హాలీవుడ్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది..
ఇకపోతే సమంత సినిమా విషయాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకు గోప్యంగా ఉంటాయని చెప్పాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా ఎట్టకేలకు నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రకటించిన రోజు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఎన్నో విషయాలను తెలియజేసింది. అందులో భాగంగానే తన ఫస్ట్ లవ్ గురించి కూడా తెలియజేసింది.. నిజానికి ఏ మాయ చేసావే సినిమాలో జెస్సి పాత్రలో నటించడానికి చాలా కష్టపడ్డాను.. కాలేజీలో ఉన్న సమయంలో మోడలింగ్ చేసేదాన్ని.. యాడ్స్ లో కూడా నటించాను. అలా యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో నెమ్మదిగా ఇన్స్టిట్యూట్లో చేరి నటన నేర్చుకొని నటన కొనసాగించాను అంటూ సమంత తెలియజేసింది.
ఇక ఈ క్రమంలోనే 8వ తరగతి చదువుతున్న సమయంలో ఒక సీనియర్ నన్ను ఇష్టపడ్డాడు.. నేను కూడా అతడిని ఇష్టపడ్డాను ..కానీ అధిక చిన్న వయసు కాబట్టి విద్య పైన దృష్టి సారించాల్సి వచ్చింది.ఇక అతడే నా ఫస్ట్ క్రష్ అంటూ తెలియజేసింది. ఇకపోతే తన తండ్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, తనకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని కూడా తెలియజేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనలో ఎలాంటి మార్పు రాలేదని కూడా తెలియజేసింది. ఏది ఏమైనా ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాగచైతన్య అభిమానులు సమంత పై ఒక రకంగా ఫైర్ అవుతున్నారు. ఎప్పుడో ముగిసిపోయిన ఫస్ట్ క్రష్ గురించి చెప్పింది కానీ నాగచైతన్యపై తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేదు అంటూ ఆమెను నిట్టూరుస్తున్నారు.