Hair Tips : చాలా మంది ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలు కలిగిన షాంపులు వాడటం వల్ల కాని, జీవన శైలి మారుతున్న కారణం చేత. జుట్టు రాలే సమస్యలతో బాధపడేవారు ఎక్కువ అయ్యారు . ముఖ్యంగా పట్టణాల్లో ఉండేవారికి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది . ఎందుచేత జుట్టు రాలుతుందో తెలియక జుట్టుకు రకరకాల షాంపూలు వాడి జుట్టును ఇంకా ఎక్కువగా పోగొట్టుకుంటారు. ఆలా చేయకుండా ఎదో ఒక దానినే వాడాలి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఇంట్లోనే దొరికే కరివేపాకుతో మన జుట్టు రాలే సమస్యలను తొలగించవచ్చు.
కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటి పెరటిలో , ప్రతి ఒక్క కిచెన్ లో దొరికే కరివేపాకుతోనే ఈ రెమిడీని పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు. దీనితో పాటు తెల్లజుట్టును కూడా తగ్గించుకోవచ్చు దీని కారణంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.జుట్టు రాలే సమస్యను తగ్గించుకుని బలమైన జుట్టును మీ సొంతం చేసుకోవడమే కాకుండా డబ్బును కూడా పొదుపు చేసుకోవచ్చు. కరివేపాకు రెమిడీని ఎలా పాటించాలో చూద్దాం. ముందు రోజే కరివేపాకుని సేకరించి దానిని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దీని తరువాత కరివేపాకు పేస్ట్లో పెరుగును కలిపి జుట్టుకు రాసుకోవాలి.
ఈ మిశ్రమం. పూర్తిగా ఆరిన తరువాత మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఇలా చేయడం వలన జుట్టుకు తగినంత తేమ అందుతుంది. అలాగే కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. కరివేపాకుతో ఈ చిన్న చిట్కాను. పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య. తగ్గుముఖం పడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కరివేపాకు కషాయాన్ని తాగాలి. కషాయం తాగడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. శరీరంలోని మలినాలు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాబట్టి ఈ రెమిడనీ ఓసారి పాటించి చూడండి. మీకే తఫలితం ఆ ఫలితాన్ని మీరే గమనిస్తారు.