Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ అభిమానులకి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఒకప్పుడు కమీడియన్ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి మనవడిగా.. స్టార్ ప్రొడ్యూసర్ అయినా అల్లు అరవింద్ గారి కొడుకుగా ఇండస్ట్రీలో తనదైన పేరుని సంపాదించు కోవడంతోపాటు కష్టపడి ఎదిగిన వ్యక్తిగా.. సొంత టాలెంట్ తో తన సినిమా లోని డాన్స్ పెర్ఫార్మన్స్ న్స్ తో ప్రజలను మేపిస్తూ వచ్చాడు.. తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఫిక్స్ అయిపోయాడు ప్రెసెంట్ బన్నీ “పుష్ప 2” సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు..
సినిమా షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ లైఫ్ నీ ఎంజాయ్ చేయడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి అల్లు అర్హ, అల్లు అయాన్ ఇద్దరు పిల్లలు.. అల్లు అర్జున్ అతని భార్య పిల్లలు సందడి చేసే వీడియోస్ ని.. ఫ్యామిలీ ఫంక్షన్ ఫొటోస్ ని సరదాగా ఆటో పట్టించే వీడియోలని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ. ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా స్పందింప చేస్తుంటారు.. అయితే రీసెంట్ గా తన పిల్లల కెరీర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ తమ పిల్లల భవిష్యత్తు కోసం మొదటి నుంచే ఇండస్ట్రీలో తెరంగేట్రం చేపిస్తూ తమ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా అల్లు అర్హ సమంత నటించిన శకుంతలం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసింది.
అయితే ఈ సినిమా అయిన తర్వాత అల్లు అర్జున్ ఇకపై తన పిల్లల్ని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని అనుకుంటున్నారట. వాళ్ల చదువులు అయిపోయిన తర్వాతే సినీ ఇండస్ట్రీకి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారట. వాళ్ల చదువులు పూర్తి చేసుకున్న తర్వాతే సినీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట అంతే తప్పితే చైల్డ్ యాక్టర్స్ గా వారికి ఇకపై ఇండస్ట్రీలో నటింప చేయదలుచుకోవట్లేదని అనుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ముందు చదువు ఆ తర్వాతే సినిమాలే అని పిల్లలని ఇండస్ట్రీకి కొంచెం దూరంగా పెడుతున్నందుకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు. హీరో అంటే నువ్వే అన్నా అని అల్లు అర్జున్ ని పిల్లల భవిష్యత్తు కోసం తండ్రిగా నీ బాధ్యతలు ఫుల్ ఫిలిం చేస్తున్నావ్ అంటూ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు బన్నీని అభినందిస్తున్నారు.