Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో శాకుంతలం కూడా ఒకటి.. ఈ సినిమా ఇప్పటివరకు ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఈ సినిమా నిర్మాత నీలిమా గుణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాకుంతలం సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు..

శాకుంతలం సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మాత దిల్ రాజుతోపాటు నీలిమ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా 3D టెక్నాలజీతో రూపొందిస్తున్నామని నీలిమ తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని 3D టెక్నాలజీలోనే ఎందుకు చూడాలి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందుకు నీలిమ వివరణ కూడా ఇచ్చారు. శాకుంతలం సినిమా ఒక అందమైన ప్రేమ కథ. ప్రకృతి ఒడిలో అందంగా సాగిపోయే ఈ సినిమా జంతువులు ప్రకృతితో ప్రేమించబడిందని ఆమె వివరించారు. శాకుంతలం సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.