Singer Sunitha : సింగర్ సునీత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండాలంటే అతిశయోక్తి కాదు.. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా అరంగేట్రం చేసి ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. అంతేకాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ.. అనేక మంది కథానాయికలకు గాత్రదానం చేసింది. సుమారు 500 సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ గా పని చేశారు. సునీత్ ఎంతమంది స్టార్ హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారో తెలుసా.!?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో జ్యోతికకు సునీత డబ్బింగ్ చెప్పారు. చిరంజీవి, సౌందర్య నటించిన చూడాలని ఉంది సినిమాలో సౌందర్య కు తన వాయిస్ అందించింది. చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్ నటించిన ఇంద్ర సినిమాలో సోనాలి బింద్రేకు సునీత డబ్బింగ్ చెప్పారు. అక్కినేని నాగార్జున, స్నేహ నటించిన శ్రీరామదాసు సినిమాలో స్నేహకు డబ్బింగ్ చెప్పారు. శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార కోసం సునీత వాయిస్ అందించారు. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే తనూరాయ్ కోసం సింగర్ సునీత డబ్బింగ్ చెప్పారు. కమలినీ ముఖర్జీ నటించిన ఆనంద్, గోదావరి సినిమాలకు సునీత వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంకా అర్తి అగర్వాల్, శ్రియ,చాబ్రియా, తమన్నా, హన్సిక కు డబ్బింగ్ చెప్పారు.