Anasuya : న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. జబర్దస్త్ షోలో యాంకర్ గా అడుగుపెట్టి అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..

తాజాగా సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ చేసిన పోస్ట్ కన్నీళ్లు పెట్టిస్తోంది. నేను నరకం కంటే ఎక్కువ బాధను అనుభవించాను.. అంతబాధలు ఎవ్వరూ పడి ఉండరు. అందుకే నేను ఎవరిని బాధ పెట్టను అని అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు ఇంతలా అనసూయను ఎవరు బాధపెట్టి ఉంటారు అని చర్చించుకుంటున్నారు. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండే అనసూయ ఒక్కసారిగా ఇలాంటి ఎమోషనల్ పోస్ట్ చేయటంతో ఈ పోస్ట్ అందర్నీ ఆలోచింపచేస్తుంది. అనసూయ బాధ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాలి మరి..