Samantha : ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు నాగచైతన్య, సమంత పరిచయమయ్యారు.. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం.. కొంతకాలం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమ, పెళ్లి వరకు వచ్చింది.. కానీ ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం లేదు అనే చెప్పాలి.. కొంతకాలం ఈ జంట అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. గత ఏడాది అక్టోబర్ లో అధికారికంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.. ఈ మధ్యకాలంలో హీరో నాగ చైతన్య ధూళిపాళ్ల శోభిత అనే హీరోయిన్ ప్రేమయాణం జరుగుతుందని.. వీళ్ళు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపించాయి.. కొంతకాలం తర్వాత ఆ ప్రచారం నిజం కాదని సమసిపోయింది.. తాజాగా మరో ప్రచారం మొదలైంది.. అదేంటంటే.. సమంతా రెండో పెళ్లికి సిద్ధమైంది..!!
తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో సమంత పెళ్ళికి సిద్ధంవుతుంది అని ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దీనికి ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమని ప్రచారం కూడా జరుగుతుంది.. సమంత ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలలో ఈషా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలలో.. తన స్నేహితులతో ప్రతి ఏడాది ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటూ ఉంటుంది. ఆమెకు జగ్గి వాసుదేవ్ పలు ఆధ్యాత్మిక విషయాలతో పాటు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయన సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం సమంతా తల్లి కూడా తనను రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటే.. ఆమె పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక గర్భధరణ కలగకుండా ఆపరేషన్ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి.. అయితే దీనిపై ముంత మేనేజర్ మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదని ఇవన్నీ ఒట్టి పుకార్లు అని ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. అయితే సమంత రెండో పెళ్లి విషయంపై అతను స్పందించకపోవడంతో..
సమంతా నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటుందేమోనని అంతా అనుకునేలాగా సోషల్ మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు.. కానీ ఈ వార్తలు నిజమెంతుందో తెలియాలంటే సమాంత నుంచి అధికారిక స్పందన రావాల్సిందే.. అప్పటివరకు ఈ వార్తలలో నిజం లేదని తెలుసుకోవాలి.. సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా యశోద సినిమాకి తెలుగు, తమిళ డబ్బింగ్ పూర్తి చేయ వలసి ఉంటుంది.. ఈ సినిమాని కూడా త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే సమంత రెండో వివాహం పై మేనేజర్ ఇంకా నోరు విప్పకపోవడంతో సోషల్ మీడియాలో ఈ వార్త నిజమేమో అని పుకార్లు జరుగుతున్నాయి. సమంత, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో లో పాల్గొంటున్నట్లు సమాచారం.