Balakrishna : నందమూరి బాలకృష్ణ సినీ అభిమానులకు ప్రత్యేకంగా ఏ పేరు చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ హోస్ట్ వచ్చిన అన్ స్టాపబుల్ భారీగా సక్సెస్ కావడంతో.. ఇప్పుడు సీజన్ 2 కోసం నిర్వాహకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.. ఈ అన్ స్టాపబుల్ షో లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావటం చాలా ప్రత్యేకతగా నిలిచింది. ఇలా వచ్చిన సెలబ్రిటీస్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ లో చేస్తూ అనేక కాంట్రవర్సీ విషయాలపై కూడా ప్రశ్నలు వేసిన బాలకృష్ణ.. ప్రజల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు..
సెలబ్రెటీస్ తో పాటు సమాజంలో మంచి పనులు చేస్తూ తెలుగులోకి ఎంతో మంది వ్యక్తులను వారి గురించి ప్రజలకు తెలిసే విధంగా అన్ స్టాపబుల్ వేదికపైకి పిలిపించి.. వారితో సన్నిహితంగా మాట్లాడి చేయగలిగినంతవరకు సహాయం చేసిన నందమూరి బాలకృష్ణను విమర్శకులు సైతం మెచ్చుకునే విధంగా బాలకృష్ణ చేశారు..! మొదటి సీజన్ లో చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు.. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వచ్చారు.. అలాగే డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్, సుకుమార్, అనిల్ రావిపూడి, దర్శక ధీరుడు రాజమౌళి వంటి పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. ఈ షో కి మొదటి సీజన్ వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన విధానం.. పోస్టింగ్ చేసిన విధానం ప్రజలందరూ నందమూరి బాలకృష్ణ లో కొత్త కోణాన్ని చూసామని చెప్తున్నారు..
అయితే సీజన్ 2 కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. దీపావళికి ఈ సీజన్ 2 తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. సెకండ్ సీజన్ లో మెగా కాంపౌండ్ కి చెందిన సెలబ్రిటీలు సీజన్ 2 షో లో కనిపించబోతున్నట్లు సమాచారం.. వారితోపాటు బాలకృష్ణ కి అత్యంత సన్నిహితంగా ఉండే వెంకటేష్, నాగార్జున ని కూడా రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.. అలా హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఇందులో మొదటిగా వినిపిస్తున్న పేరు అనుష్క శెట్టి.. స్వీటీ ఈ షోకి వస్తె బోలెడు సీక్రెట్స్ రీవిల్ అవుతాయి.. అయితే ఈ నెలాఖరులో అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయబోతున్నట్లు సమాచారం..