Health Tips : సాధారణంగా ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి మొక్కలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్క రోగాన్ని నయం చేసే విధంగా మనకు సహాయపడతాయి. అందుకే క్రీస్తుపూర్వం నుంచి ఆయుర్వేద శాస్త్రానికి మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక కేరళ వంటి ప్రాంతాలలో కూడా ఇప్పటికీ ఆయుర్వేద శాస్త్రాన్ని నమ్ముతున్నారు అంటే ఆయుర్వేద వైద్యం ఎంత ప్రావీణ్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా చెప్పబోయే ఒక ఆకు గురించి మీరు తెలుసుకుంటే చిన్నచితక జబ్బుల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు ఈ వ్యాధులను తగ్గించుకోవడానికి మీరు వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.. ఇక అదేదో కాదు బొప్పాయి మొక్క.
ఈ మొక్క నుంచి లభించే ఆకులు, పండ్లు , గింజలు అన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా ఈ చెట్టు మన పెరట్లో ఉంటే ఇక డాక్టర్ అవసరం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇకపోతే బొప్పాయి గింజలు కూడా అనేక రకాలుగా మీకు సహాయపడతాయి. ఈ ఆకులు తినడానికి కొంచెం చేదుగా ఉన్నా సరే ప్రయోజనాలు మాత్రం నిండుగా కలిగి ఉన్నాయి. మనకు బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ , బి, సి , డి అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. మలేరియా నుండి క్యాన్సర్ వరకు ఎన్ని రోగాలునైనా సరే బొప్పాయి ఆకులు నయం చేయగలవు
ఇక ఆడవారిలో తరచూ కనిపించే జుట్టు సమస్యలను నయం చేయడంలో ఈ ఆకులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. జుట్టు సంబందించిన సమస్యలు ఉన్నప్పుడు బొప్పాయి ఆకుల రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు కి కండిషనర్ గా పనిచేసి జుట్టును పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని బొప్పాయి ఆకుల రసం పెంచుతుంది. ఇక రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి డయాబెటిస్ వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలను నివారించడంలో కూడా ఈ ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి. బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డెంగ్యూను నివారించుకోవచ్చు ముఖ్యంగా బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది. ఇక లివర్ డామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బొప్పాయి ఆకులు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.