Samantha : ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తరువాత కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం ఈ సినిమా వచ్చేనెల ఫిబ్రవరి 17న విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఊహించని స్థాయిలో రెస్పా న్స్ ను తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమాని తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోనూ బాలీవుడ్ లోనూ విడుదల చేయాలని చిత్ర యూనిట్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సౌత్ ఇండియన్ పౌరాణిక సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే సమంత శాకుంతలం సినిమా ను అక్కడ భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
శాకుంతలం సినిమా కోసం యశోద షూటింగ్లో కూడా సమంత ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ సమయం కేటాయించలేదని సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే సమంత ఆరోగ్య విషయం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మయో సైటిస్ సమస్యతో బాధ పడుతుంది. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగైనప్పటికీ సమంత స్వయంగానే తెలుగు తమిళ హిందీ భాషల్లో శకుంతల ప్రమోషన్స్ కి స్వయంగా సమంతా ని పాల్గొనబోతున్నట్లు సమాచారం.
అయితే తాజాగాఅనారోగ్య సమస్యల నుండి తేరుకోకున్నా కూడా సమంత ఓపిక తెచ్చుకుని మరీ ఇటీవల శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నది. త్వరలో సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సమంత పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సమంత నార్త్ లో కనిపించడానికి వీళ్ళని అక్కినేని కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఆ ఇంటి సభ్యులు ఒకరు అన్నారట. ఇప్పుడు సమంత శకుంతల సినిమాను నార్త్ లో రిలీజ్ చేస్తూ వాళ్ళ చెంప చెళ్లుమనిపించేలా చేస్తుంది ఈ దెబ్బతో.. సమంత సమయానుకూలంగా రివెంజ్ తీర్చుకుంటుంది.