VeeraSimhaReddy :నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు చెప్పగానే నోటి నుంచి వచ్చే మొట్టమొదటి పదం జై బాలయ్య టాలీవుడ్ నటి సింహం బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తరువాత ఆహ్వానం అన్స్టాపుల్ హోస్ట్ గా రాణిస్తూ హీరో గాను మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
తాజాగా నటసింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలో వీర సింహారెడ్డి సినిమాతో ఇప్పటివరకు దాదాపుగా 120 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లోను మంచి మార్కెట్ ఉండడంతో అఖండ గ్రాస్ కలెక్షన్స్ ని కూడా వీరసింహారెడ్డి సినిమాతో దాటి వేయటం గమనార్ధం. బాలకృష్ణకు ఓవర్సీస్ లో అంత మార్కెట్ ముందు నుంచి లేదు ఒక మాటలో చెప్పాలంటే నైజాం లోను బాలయ్య బాబుకి అంతగా మార్కెట్ లేదు.
ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి ఓవర్సీస్‌లో బాలయ్య కెరీర్ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి అమెరికాలో 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది కెరీర్ పరంగా ఓవర్సీస్‌లో బాలయ్యకు సరికొత్త రికార్డే.
ఇంతకు ముందు బాలయ్య నటించిన అఖండ సినిమా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు 928 కే డాలర్ల వసూళ్లు రాబట్టింది.
తాజాగా 1.4 బిలియన్ డాలర్లతో అఖండ మూవీ రికార్డ్స్ ను బద్దలు కొట్టిన బాలయ్య ఓవర్సీస్ లో బాలయ్య కెరియర్ లోనే మొదటి స్థానంలో వీర సింహారెడ్డి నిలిచింది. దీనితో బాలయ్య బాబుకు ఓవర్సీస్ లోనూ మంచి గుర్తింపు ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనా బాలయ్య బాబు ఆహా హస్ట్ గాను సినిమాల్లోనూ తనదైన స్టైల్లో ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నారు.