Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ మెగాస్టార్ చిరంజీవి అని తెలియని వారు ఎవరు ఉండరు. తన స్వయంకృషితో యాక్టింగ్ తో ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో అగ్రస్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఎంతో మంది యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్లు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే ఉంటారు ..అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కడుపును పుట్టిన తన కూతురు అయిన శ్రీజ చిరంజీవి పేరును స్థాయిని సోషల్ మీడియాలో రోజురోజుకీ మరింత దిగజారుస్తున్నట్లు తెలుస్తుంది.
రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ మరోసారి హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతుంది శ్రీజ. సోషల్ మీడియాలో ఆమె రాసుకోస్తూ ..”నా ఒడిదుడుకుల్లో ప్రశాంతత చీకటి వెలుగువు .. 14 ఏళ్ల వయసులో నీతో అనుబంధం మొదలైంది.. నేను నిద్ర లేస్తున్నాను అంటే అది నీ కోసమే మై డియర్ “అంటూ ఇంస్టాగ్రామ్ లో కాఫీ త్రాగుతున్న వీడియోను షేర్ చేసింది .
అయితే దీంతో సోషల్ మీడియాలో శ్రీజను మరో విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న శ్రీజ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్లు చేయడంపై చిరంజీవి అభిమానులు కూడా ఈమెను విమర్శిస్తున్నారు. అయితే ఈమె మూడో పెళ్లి చేసుకునే విషయం పక్కన పెడితే ఇలా చిరంజీవి పరువు తీయడంపై చిరంజీవి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
బంగారం లాంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా కేవలం కాఫీ కోసం నువ్వు నిద్ర లేవడం ఏంటి నువ్వు చేసిన ఎన్నో తప్పులను మీ తల్లిదండ్రులు ఇద్దరు గుండెల్లో ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. నీకోసం వాళ్లు బతుకుతుంటే నువ్వు కేవలం కాఫీ కోసమే బ్రతుకుతున్నావా? ఈ పోస్ట్ పెట్టమని నిన్ను ఎవరు అడిగారు పెట్టకపోయినా అందరం సంతోషించే వాళ్ళం దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టి మా చిరంజీవి పరువు తీయొద్దు అంటూ.. మెగా ఫ్యాన్స్ శ్రీజను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఆమె ఆటిట్యూడ్ పై మరి కొంతమంది మండిపడుతున్నారు.