Allu Arjun :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రేక్షకులకే కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కి మంచి గుర్తింపు ఉంది . అయితే తాజాగా గూగుల్ సెర్చ్ లో అత్యధిక హీరోస్ లిస్టులో అల్లు అర్జున్ 2022 లో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గూగుల్ సర్చ్ లిస్టులో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉండడం ఇది రెండవసారి.
2022లో తన సినిమాలు విడుదలకుండానే టాప్ ఫైవ్ లిస్టులో అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు. 2021 డిసెంబర్లో పుష్ప: ది రైజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత మరే సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేదు. అయినా కూడా గూగుల్ సెర్చ్ లో మొదటి స్థానంలో ఉండటం అనేది అల్లు అర్జున్ క్రేజ్ అటువంటిది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ సర్చ్ లిస్టులో రెండవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. మూడవ స్థానంలో ప్రభాస్ ఉండగా.. నాలుగవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ఐదవ స్థా నంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా 2022 ప్రారంభంలో తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఆదిపురుష్ టీజర్ కూడా విడుదల చేసి వార్తల్లో నిలిచారు ప్రభాస్.
ఆ తర్వాత సలార్ షూటింగ్ సెట్ నుండి లీకైన ఫోటోలు కూడా అందరి దృష్టి ఆకర్షించేలా చేశాయి. మరోవైపు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రభాస్ మరియు మహేష్ బాబు రామ్ చరణ్ అందరూ నెక్స్ట్ సినిమా కోసం ఎవరికి వారు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.