Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. సమంత నాగచైతన్య నుంచి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లు ప్రేమించుకున్నంత కాలం కూడా కలిసి ఉండలేకపోయారు. దాంతో గత ఏడాది విడాకులు తీసుకున్నారు.. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఇటీవల సమంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. సమంత విడాకుల వ్యవహారం.. ఆ తరువాత మయో సైటిస్ వ్యాధి ఇలా హెడ్లైన్స్ లో నిలుస్తా వస్తోంది . సమంత తాజాగా తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మెట్టు మెట్టు కి కర్పూరాన్ని వెలిగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. దీంతో సమంత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంది. కాబట్టే ఇలా దేవుడికి మెట్లు పూజ నిర్వహించిందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.
ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమకు సంబంధించిన పోస్టులను పెడతారు ఎవరైనా.. కానీ సమంత విచిత్రంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా ఆ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ.. నవ్వుతున్న ఎమోజి ను కూడా షేర్ చేసింది. దాంతో తనకు సినిమా అంటే ఎంత ప్రేమ అనే విషయాన్ని సమంత ఇండైరెక్టుగా చెప్పకనే చెప్పేసింది అని నేటిజన్లో కామెంట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లోనే సమంత పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లోను నటిస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం.. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.