Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే.. ఆ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రామాయణ ఇతిహాస కావ్యంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్.. ఈ సినిమా టీజర్ ఏ ముహూర్తాల రిలీజ్ చేశారు కానీ‌. అప్పటినుంచి ఈ సినిమాపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన టీజర్ పై ప్రేక్షకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం..

 good news for prabhas fans adi purush second teaser
good news for prabhas fans adi purush second teaser

అంతేకాకుండా ఈ సినిమా విడుదలపై స్టే విధించాలి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలాలు అయ్యాయి. ఇన్ని విమర్శలు మధ్య ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాకుండా వెనక్కు తగ్గి.. విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడం కోసం ఏకంగా ఆరు నెలలు ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఆదిపురుష్‌ చిత్ర యూనిట్ మెరుగైన విజువల్ ఎఫెక్ట్స్ కోసం కష్టపడుతుంది..

ఆదిపురుష్‌ సినిమా నుండి మరో టీజర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. శ్రీరామనవమి సందర్భంగా రెండో టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా టీజర్ ను కట్ చేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.‌

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా కనిపించనున్నారు. టి సిరీస్, రెడ్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.