Sales Force: ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో గ్లోబల్ కంపెనీలు ఖర్చుల నియంత్రణ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించడం, జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ బాటలో ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ , ట్విట్టర్ అమెజాన్ వంటి దగ్గర కంపెనీలు నడిచాయి.. తాజాగా అమెరికాకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ కార్పొరేషన్ సాఫ్ట్వేర్ ఖర్చులను తగ్గించుకోవడం కోసం తాజాగా 7350 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది మొత్తం వర్క్ ఫోర్సులో 10శాతం గా ఉండనుంది..
కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 73500 కు పైగా ఉంది. అంతేకాకుండా కంపెనీ కొన్ని ఆఫీసులను సైతం మూసివేయునన్నట్లు సమాచారం.. తాజాగా ఈ కంపెనీ సీఈవో చాలామంది ఉద్యోగులను తొలగించినందుకు విచారం వ్యక్తం చేశారు. సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనియోఫ్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రెండు గంటల సమయంలో 7000 మంది ఉద్యోగులను తొలగించడం చెడు ఆలోచన అని అన్నారు. మేము వివరించలేని వాటిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంత పెద్ద సమూహంలో అలాంటి కాల్ చేయడం అది ప్రభావవంతంగా ఉండటం కష్టం. దీనికి మూల్యం చెల్లించాము అని ఆయన తెలిపారు.
సేల్స్ ఫోర్స్ సీఈవో వేలమంది ఉద్యోగులను తీసేయడం భయంకరంగా భావించినప్పటికీ.. అలాంటిది ఒక పెద్ద సంస్థలో ఇలాంటివి కామన్ అని అన్నారు. నేను జీవితకాల ఉపాధిని అందించాలని కోరుకుంటున్నాను. కానీ వాస్తవం ఏమిటంటే మీరు 80,000 మంది ఉద్యోగులతో పెద్ద కంపెనీ ని కలిగి ఉన్నప్పుడు .. మీరు హెడ్కౌంట్ సర్దుబాటు చేయవలసి ఉంటుంది. మా తొలగింపు ప్యాకేజీలు చాలా ఉదారంగా ఉన్నాయి అని బెనియోఫ్ తెలిపారు.