Samantha : గాయపడ్డ సమంత.. ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ కంగారు..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే.. సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.. సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.. కాగా సమంత ఆ సిరీస్ కి సంబంధించిన ఓ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా.. అది అభిమానులకు ఆందోళనను కలిగిస్తుంది..

Samantha hands injured on action seens shooting
Samantha hands injured on action seens shooting

సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత భారీ యాక్షన్ సన్నివేశాలకు ట్రైనింగ్ తీసుకుంటుంది. ఈ సిరీస్ కోసం జిమ్ లో ట్రైనర్ తో ఎంతలా కష్టపడుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంతా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన రెండు చేతులు రక్తంతో దెబ్బలతో ఉండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. అయితే చిత్ర యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్లో భాగంగా ఇలా గాయపడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సమంతా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే సమంత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆరోగ్యం పట్ల సమంత శ్రద్ధ తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు సినిమా కోసం ఇంతలా హార్డ్ వర్క్ చేస్తుండడం పట్ల సమంతా పై ప్రశంసల వెలువ కురిపిస్తున్నారు. సమంత డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లోనూ ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సమంత ఈ సిరీస్ లో ప్రధాన పాత్రులలో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ భారీ వ్యయంతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తుంది.

సమంత నటించిన శాకుంతలం సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ సినిమా షూటింగ్ ముగియగానే సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ లో పాల్గొననుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి . ఈ చిత్రంతో సమంత హిట్ అందుకుంటే తన కెరియర్ గ్రాఫ్ రెట్టింపు అవుతుందని సందేహం లేదు.