Siddharth : హీరోయిన్ అదితి రావు హైదరితో హీరో సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తూనే ఉంది. ఆ వార్తలని నిజం చేసే పనిలో పడ్డారు సిద్ధార్థ్ అదితి. ఇటీవల హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. అంతేకాదు హీరో శర్వానంద్ రక్షిత పక్కన వీళ్ళిద్దరూ పక్కపక్కనే నిలబడి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. ఇది చాలదన్నట్టు తాజాగా వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పంచుకోగా.. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వీళ్ళిద్దరూ జంటగా చక్కర్లు కొట్టడం చేస్తున్నారు. మరోపక్క సినిమా, ప్రైవేట్ ఈవెంట్స్ లో కలిసి హాజరవడంతో తరచూ సిద్ధార్థ్ అదితి వార్తల్లో నిలుస్తున్నారు. కాగా ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్ పై ఈ జంట స్పందించలేదు.. ఇది ఇలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.
సిద్ధార్థ్ అదితి కలిసి హీరో విశాల్ నటించిన ఎనిమి చిత్రంలోని పాపులర్ హిట్ సాంగ్ తుమ్ తుమ్ అనే పాటకు కూడా స్టెప్పులు వేశారు. ఈ వీడియోను అదితి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో.. క్షణాల్లో వీరి డాన్స్ వైరల్ గా మారింది. దీంతో ఇంకా లేట్ ఎందుకు త్వరలోనే మీ పెళ్లి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేసేయండి అంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
శర్వానంద్ హీరోగా నటించిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి కూడా నటించారు. మహాసముద్రం సెట్స్ లోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఇద్దరికీ జత కుదిరిందని సమాచారం. వీళ్ళు అధికారికంగా తమ రిలేషన్షిప్ లో ప్రకటించినప్పటికీ పరోక్షంగా హింట్ ఇస్తున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.