Samantha : సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఒక్కేఒక్కమాట..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తనలో తానే, తనతో తానే యుద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.. తనకు వచ్చిన మయోసైటిస్‌తో పోరాడుతోంది. తాజాగా సమంత పోరాటం మీద రాహుల్ రవీంద్రన్ ఓ పోస్ట్ చేయగా.. దానికి సమంత స్పందించింది..

samantha-emotional-post-on-rahul-ravindran-post-its-viral
samantha-emotional-post-on-rahul-ravindran-post-its-viral

రాహుల్ రవీంద్రన్ పోస్ట్ లో.. సమంత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి సమస్యలు వచ్చినా కూడా నువ్ పోరాడుతూనే ఉన్నావ్.. ఇంకా పోరాడుతూనే ఉంటావ్.. ఎందుకంటే నువ్ ఉక్కు మహిళవి.. నిన్నూ ఏదీ ఓడించలేదు.. బాధపెట్టలేదు.. పైగా అవన్నీ నిన్ను మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంటాయి.. అని పోస్ట్ చేయగా సమంత స్పందించింది.

సమంత థాంక్యూ రాహుల్ అని ఎమోషనల్ అవుతూ.. బయట ఎవరైతే తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరి కోసం ఇది చెబుతున్నా.. పోరాడుతూనే ఉండండి.. ఇంకా మీరు బలంగా తయారవుతూ ఉంటారు.. ఇంకా ధృడంగా మారి కష్టాలను ఎదురిస్తారు అని చెప్పుకొచ్చింది.. సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.