Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.. ఇక అవి సెట్స్ పైన ఉండగానే మరిన్ని కొత్త కథలు వింటున్నాడు. తాజాగా ప్రభాస్ మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్, సుకుమార్‌తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తన కెరీర్ బిగెనింగ్ నుండి ప్రభాస్‌తో సినిమా చేయాడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ ఆర్య కథ ముందుగా ప్రభాస్‌కే వినిపించాడట. కానీ ప్రభాస్‌కు అప్పుడున్న కమిట్మెంట్స్ కారణంగా నో చెప్పాడట. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రయత్నించిన వీరి కాంబో సెట్ అవ్వలేదు. ఇన్నేళ్లకు సుకుమార్ కోరిక తీరబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ కి సుకుమార్ తన కథను నెరేట్ చేశాడట. ప్రభాస్ కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నాడట. ‘పుష్ప-2’ ముగిశాక ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.