Hair Tips : జుట్టు పొడవుగా పెరుగుతూ మెరిసి పోవాలంటే రూపాయి ఖర్చులేని ఈ టిప్ ట్రై చేయండి..

Hair Tips : ఈరోజుల్లో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్యలు జుట్టు రాలిపోవడం.. మార్కెట్లో దొరికే వివిధ హెయిర్ ప్రొడక్ట్స్ కంటే ఇంట్లో లభించే వస్తువులతో జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు.. అంతేకాదు జుట్టు నిగనిగలాడే లాగా కూడా చేసుకోవచ్చు. ఈ టిప్స్ ట్రై చేయండి. జుట్టు ఒత్తుగా మెరిసిపోయేలా చేస్తాయి.

Hair tips for hair growth and shainyness
Hair tips for hair growth and shainyness

బియ్యం లో అమినో యాసిడ్స్, విటమిన్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇంకా జుట్టును బలంగా, మెరిసేలా చేస్తాయి. ఈ చిట్కా కోసం 3 కప్పుల నీటిలో అర కప్పు బియ్యాన్ని వేసి మరిగించాలి. తరవాత ఆ నీటిని వడకట్టి అందులో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.

టీ పొడి జుట్టుకు సహజ మెరుపును సంతరించుకునేలా చేస్తుంది. ఈ టిప్ కోసం మూడు చెంచాల టీ పొడిని నీటిలో వేసి మరిగించి వడకట్టి.. ఆ నీళ్లు చల్లగా అయ్యాకా మీ తలపై స్ప్రే చేసి, 30 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.. జుట్టు ఒత్తుగా, షైనీ గా పెరిగిపోతుంది.