Sai Pallavi : నోటికి ఏది వస్తే అది మాట్లాడకు .. సాయి పల్లవి మీద పిచ్చ ఫైర్ అవుతున్న జనాలు !

Sai Pallavi : నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. లేడి ప‌వర్ స్టార్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న సాయి ప‌ల్ల‌వి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. మెడిసిన్ చదివిన సాయి పల్లవికి మొదటి నుంచీ తన బాడీ మీద కంట్రోల్ పెట్టుకుంటుంది. ఎంత తిన్నా కాని.. తన బాడీని కరెక్ట్ గా ఫిజిక్ లో పెట్టుకోవడానికి హెల్తీగా ఉండడానికి ..సాయి పల్లవి ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ప‌ర్‌ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది. అంద‌రి మాదిరిగా సాయి ప‌ల్ల‌వి జిమ్‌ల‌కి వెళ్ల‌దు, వ‌ర్క‌వుట్స్ చేయ‌దు అయిన‌ప్ప‌టికీ స్లిమ్‌గా నాజూగ్గా ఉంటుంది. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిన్నదానికి ఫిదా సినిమాను ఆఫర్ చేయ‌డంతో అందులో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది.

sai-pallavi-sensational-comments-on-dance-show
sai-pallavi-sensational-comments-on-dance-show

Sai Pallavi : ఇలా మాట్లాడిందేంటి..

చిత్రంలో తెలంగాణ పిల్లగా ఈ సినిమాలో సాయి పల్లవి నటన సూపర్ అనే చెప్పాలి. యంగ్ హీరోల సరసన నటిస్తూ మంచి హిట్స్ ను అందుకుంటున్న సాయి ప‌ల్ల‌వి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే గార్గి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఇది పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. అయితే సినిమాల‌ల‌లోకి రాక‌ముందు ఈ అమ్ము డ్యాన్స్ పోటీల‌లో పాల్గొని వాటితో వ‌చ్చి క్రేజ్ తో సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు ఆ డ్యాన్స్ పోటీల‌పైనే విమ‌ర్శ‌లు చేస్తుంది.

త‌మిళ విజ‌య్ టీవీలో ప్ర‌సార‌మైన మీలో ఎవ‌రు ప్ర‌భుదేవా డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న ఆమె ద్వితీయ బ‌హుమ‌తి గెలుచుకోవ‌డం చాలా బాధ‌పెట్టింద‌ట‌. డ్యాన్స్ పోటీల్లో ప్ర‌తిభ‌కు గుర్తింపు ఉండ‌దు… ఛానెళ్ల‌లో డ‌బ్బుతో పాటు స్టార్స్ వార‌సుల‌కే ఎక్కువ మ‌ర్యాద‌లు ఉంటాయంటూ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ కార‌ణంతోనే త‌న‌కు డ్యాన్స్ పోటీలంటే న‌మ్మ‌కం లేద‌ని.. అస‌హ్యం అని కూడా చెప్పింది. డ్యాన్స్ షోలు, టీవీ ఛానెల్స్‌పై సాయి ప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి రానున్నరోజుల‌లో ఇది ఎంత పెద్ద వివాదంగా మారుతుందో చూడాలి.