Bigg Boss 6 Telugu : తలుపులు ఓపెన్ అయ్యాయి .. హౌస్ లోంచి ఆదిరెడ్డి OUT !!!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఫ్రెండ్స్ కూడా శ‌త్ర‌వులుగా మారుతుంటారు. అలా బిగ్ బాస్ ప్లాన్స్ వేస్తుంటారు. మొగుడు పెళ్లాల మ‌ధ్య చిచ్చు పెట్టే బిగ్ బాస్ ఫ్రెండ్స్ మ‌ధ్య కూడా చిచ్చు రేప‌డంలో ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అయితే హౌజ్‌లో గీతూ, ఆదిరెడ్డి మ‌ధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. కాని ఆమె ప్లాన్ ఇత‌డికి న‌చ్చ‌క కోపంతో మైక్‌ని నేల‌కేసి కొట్టాడు. ఇన్నాళ్లు కలిసి ఉన్న ఫ్రెండ్స్.. తాజా మిషన్ పాజిబుల్ టాస్క్ కారణంగా ఉప్పూ నిప్పులా మారి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సపరేట్ రూల్స్ ఉన్నట్లు గేమ్స్ ఆడుతున్న గీతూకి హౌస్‌లో అందరూ యాంటీ అయిన‌ప్ప‌టికీ, ఆదిరెడ్డి మాత్రం ఆమెకు స‌పోర్ట్‌గా నిలుస్తూ వ‌చ్చాడు.

adi-reddy-out-from-bigg-boss6
adi-reddy-out-from-bigg-boss6

Bigg Boss 6 Telugu :  ఏం జ‌ర‌గ‌నుంది..

రాత్రి పూట గేమ్ లేదని మాట ఇచ్చి.. ట్రాప్ చేసి.. వాటిని అర్థరాత్రి ఆదిరెడ్డి స్ట్రిప్స్ దోచేసింది గీతూ. టాస్క్ స్టార్టయ్యాక.. విషయం తెలిసిన వెంటనే.. ఆదిరెడ్డి ఆగ్రహంపై ఊగిపోయి, తన షర్ట్ తీసి నేలకేసి కొట్టాడు. చీట్ చేశావంటూ ఆమెపై ఆవేశంతో ఊగిపోయాడు. వెరీ సూన్ ఆమె కళ్లలోనుంచి నీళ్లు తెప్పిస్తానని డైరెక్ట్‌గా ఆమెకే వార్నింగ్ ఇచ్చాడు. ఆదిరెడ్డిలో ఇంత ఫైర్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ఘటనతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో బిందు మాధవి ఒక్క‌సారిగా అంద‌రికి గుర్తొచ్చింది.. అయితే, అప్పట్లో ఆమెపై విమర్శలు చేసిన ఆదిరెడ్డి.. ఇప్పుడదే హౌజ్‌లో చేయడం విశేషం.

అయితే ఆదిరెడ్డి ప‌నికి బిగ్ బాస్ అత‌నిని గేమ్ నుండి డిస్ క్వాలిఫై చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌న టీమ్‌లోని ముగ్గురిని బ‌రిలోకి దింపాడు. వారు టాస్క్‌లో ఓడి నిరుత్సాహ‌ప‌రిచారు. అయితే ఆదిరెడ్డి ఈ వారం ఇంత అగ్రెసివ్‌గా మార‌డంతో అత‌నిపై వేటు ప‌డే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. బిగ్ బాస్ అత‌ని కోసం త‌ల‌పులు తెరిచాడ‌ని, ఈ వారం హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌డం ఖాయం అని కొంద‌రు ప్ర‌చ‌రాలు చేస్తున్న‌ప్ప‌టికీ అందులో నిజం లేద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వెళ్లే ఛాన్స్ లేద‌ని చెప్పుకొస్తున్నారు.