RRR: జాతీయ ఉత్తమ చిత్రంగా సత్తా చాటిన “RRR”..!!

RRR: గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచిన సంగతి తెలిసిందే. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డులు కూడా అందుకోవటం జరిగింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న “RRR” తాజాగా ఉత్తమ జాతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రాజమౌళి తో పాటు చరణ్, ఎన్టీఆర్ లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గ్లోబల్ స్టార్ లుగా మారారు. దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన “RRR” అదే స్థాయిలో.. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా నటనపరంగా డాన్స్ పరంగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా “నాటు నాటు” పాటకు అదిరిపోయే స్టెప్ లు వేయడం జరిగింది.

RRR which won the National Best Film

ఎన్నో అంతర్జాతీయ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న “RRR” ఇప్పుడు జాతీయ అవార్డు గెలవడంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మెగా మరియు నందమూరి హీరోలు చరణ్ తారక్ కలిసిన నటించటం సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. ఇదే సమయంలో రాజమౌళి దర్శకత్వం తోడవడంతో సినిమా ఊహించని రేంజ్ లో హిట్ అయింది. అప్పటికే బాహుబలి తో జక్కన్న సత్తా చాటటంతో దాని ప్రభావంతో భారీ అంచనాల మధ్య వచ్చిన “RRR” తిరుగులేని విజయాన్ని అందుకోవటం జరిగింది.