Allu Arjun: ఫస్ట్ జాతీయ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ క్రియేట్ చేయడం జరిగింది. “పుష్ప” సినిమాలో డైలాగులు ఇంకా డాన్స్ ఫైట్లు అన్ని కూడా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది.Icon star Allu Arjun created a record as the Telugu hero who received the first national award

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో కేంద్రం ప్రస్తుతం ప్రకటిస్తున్న 69వ జాతీయ సినిమా అవార్డులలో బన్నీకి ఉత్తమ నటుడి అవార్డు రావడం జరిగింది. “పుష్ప” సినిమాకు ఆయన ఈ గౌరవాన్ని అందుకొనున్నారు. ఉత్తమ జాతీయ నటుడు రేసులో బన్నీతో పాటు చరణ్, ఎన్టీఆర్ సహ జోజు జార్జి, సూర్య.. పోటీ పడగా బన్నీకే అవార్డు వరించింది.

దీంతో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడిగా అందుకుంటున్న తొలి టాలీవుడ్ హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేశారు. దీంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం “పుష్ప” సెకండ్ పార్ట్ అనేక భాషలలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తూ ఉంది. త్వరలో పుష్ప సెకండ్ భాగం విడుదల అయ్యే సమయంలో మొదటి భాగానికి జాతీయ అవార్డు రావడంతో డైరెక్టర్ సుకుమార్ తో పాటు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.