Venu: ఓటీటీ బాట పట్టిన హీరో వేణు..!!

Venu: హీరో వేణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “స్వయంవరం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవటం జరిగింది. తన అదిరిపోయే కామెడీ టైమింగ్ తో పాటు పంచ్ డైలాగులతో వేణు తన సినిమాలతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటాడు. ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం వరుస పెట్టి సినిమాలు చేసిన వేణు గత కొంతకాలం నుండి గ్యాప్ తీసుకోవటం తెలిసిందే.senior hero venu doing web series in hotstar

ఇటీవల మళ్ళీ రవితేజ సినిమా “రామారావు ఆన్ డ్యూటీ” తో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కుటుంబ ప్రేక్షకులలో వేణు మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు రీఎంట్రీ తర్వాత.. ఓటిటి రంగంలో రాణిస్తూ ఉన్నాడు. “అతిథి” అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హర్రర్ కాన్సెప్ట్ లో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించడం జరిగింది.

ఫస్ట్ టైం సరికొత్త జోనర్ లో అది కూడా ఓటీటీలో వేణు.. వస్తూ ఉండటం విశేషం. ఒకప్పటి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు ఇప్పుడు రీ ఎంట్రీలు ఇస్తున్నారు. కొంతమంది విలన్ లుగా… మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇదే సమయంలో ఓటిటి లలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ తరహా లోనే ఇప్పుడు వేణు కూడా ఓటీటీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.