Waltair veerayya : వాల్తేరు వీరయ్య నుంచీ రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల.. మాస్ జాతరే ఇక..! 

Waltair veerayya : తాజాగా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ లుక్ చూస్తుంటే ఈ సినిమా పక్క మాస్ జాతరను అందిస్తుంది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Raviteja first look teaser out from Walther veerayya..!
Raviteja first look teaser out from Walther veerayya..!

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.” ఫస్ట్ టైం ఒక పులి మేక పిల్లను ఎత్తుకొని వస్తావున్నది” అని డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఆద్యంతం కారు నుంచి రవితేజ మేక పిల్లను పట్టుకొని స్టైలిష్ గా రావడం థియేటర్లలో ఈలలు తెప్పిస్తుంది అని చెప్పవచ్చు. తెలంగాణ యాసలో రవితేజ దుమ్ము దులిపేశాడు. ఈ టీజర్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది మీరు కూడా చూసేయండి.