Ram Charan టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ – ఉపాసన జంటకు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2012లో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల తమ వైవాహిక జీవితానికి 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. అయితే వీరికి పెళ్లి శుభాకాంక్షలు చెప్పేవాళ్లు ఒక ఎత్తైతే.. పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు కనడం లేదు ఏంటి అని అడిగే వాళ్ళు కూడా చాలామంది వున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లు వివాహం చేసుకొని ఒక్కొక్కరు ఇద్దరేసి చొప్పున పిల్లలను కంటే.. రామ్ చరణ్ మాత్రం పిల్లలు అనే మాట ఎత్తడం లేదు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఇప్పుడు ఎట్టకేలకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. భగవంతుడు శ్రీ హనుమాన్ జీ ఆశీస్సులతో.. ఉపాసన – రాంచరణ్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్టకేలకు మెగా వారసుడు వస్తున్నారని తెలిసి అభిమానుల ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి.
— Ram Charan (@AlwaysRamCharan) December 12, 2022