RajaniKanth : కోలీవుడ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహారాష్ట్రానికి చెందిన ఈయన చెన్నైలోనే స్థిరపడి దేశవ్యాప్తంగా తన నటనతో మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆస్తి ఎంత ఉంది అనే వివరాలు తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ కథనంలో రజనీకాంత్ ఆస్తుల వివరాలు ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

1975లో ఇండస్ట్రీకి పరిచయమైన రజినీకాంత్ ఇప్పటివరకు సుమారుగా రూ.420 కోట్లకు పైగా ప్రాపర్టీని కూడబెట్టారు అని సమాచారం. సుమారుగా రూ.60 కోట్ల విలువైన లగ్జరీ కార్లు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. అంతేకాదు తన భార్య లత పాఠశాలలలో కూడా ఈయనకు వాటా ఉందని సమాచారం. పోయస్ గార్డెన్ లో అత్యంత ఖరీదైన ఒక భవంతి కూడా కలిగి ఉన్నారు. రజనీకాంత్ దానితో పాటు ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇంటి విలువ రూ.35 కోట్ల పై మాటే. ప్రస్తుతం ఈయన నటిస్తున్న జైలర్ సినిమా కోసం ఏకంగా రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. వ్యాపారపరంగా సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు వస్తూ ఉంటుందని సమాచారం. మొత్తంగా ఈయన ఆస్తులు చూసి ప్రస్తుతం అభిమానులే కాదు సినీ లోకమే ఆశ్చర్యపోతోంది.