krithi sanan : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించిన ఈమె ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో కూడా నటించింది. కానీ అక్కడ వరుసగా అవకాశాలు రాకపోయేసరికి బాలీవుడ్ కి మకాం మార్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రేమంటే ఏంటో అసలు తెలియదు.. కానీ చాలానే క్రష్ లు ఉన్నాయి. నేను కూడా ఒక మూడు సార్లు ఆ అనుభూతిని పొందాను. కానీ అప్పట్లో చాలా భయమేసింది. అయితే ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు అందుకే నాకు కాబోయే వారు ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకున్నాను. నాకంటే హైట్ గా ఉండాలి.. అందంగా ఉండాలి.. మంచి మాటల కారై ఉండాలి.. అంతేకాదు ఎప్పుడు నాకు బోర్ కొట్టకుండా చూసుకోవాలి.. ఇలాంటి లక్షణాలు ఉన్నవారే నాకు భర్తగా రావాలి అంటూ కోరుకుంటుంది కృతి సనన్.. మరీ ఈమె కోరిక మేరకు ఇలాంటి లక్షణాలున్న వ్యక్తి దొరుకుతాడో లేదో చూడాలి.