Samantha -Rashmika Mandanna : టాలీవుడ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సమంత ఈ అరుదైన వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని పలువురు సిడి ప్రముఖులు ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సమంతకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.
తాజాగా సమంత ఆరోగ్యం పై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. వారసుడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంతపై పోగొడ్తల జల్లు కురిపించింది రష్మిక.సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని తను చెప్పేవరకు వరకూ.. ఆ విషయం తనకు కూడా తెలియదని రష్మిక అంది. మేమిద్దరం అంతకుముందు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం అప్పుడు కూడా ఎప్పుడూ ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదని చెప్పింది. సమంత ఓ అద్భుతం.. ఇంకా తను జాలి, దయ కరుణ తో నిండి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనిపిస్తుందని.. ఆమెకు ధైర్యం చెప్పేందుకు తోడుగా నిలబడాలనుకుంటున్నానని రాష్మిక అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. సమంత తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని.. అలాంటి వ్యక్తి నుంచి ఎంతో మంది స్పూర్తి పొందుతారని.. నేను కూడా సమంత నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పింది రష్మిక. నేను ఎంతగానో ఇష్టపడే వ్యక్తులలో సమంత ఒకరని చెప్పింది.