Sitara Ghattamaneni : స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.. రీల్ హీరో కంటే రియల్ హీరోగా మంచి మనసున్న మనిషిగా కూడా నిరూపించుకున్నాడు. చిన్నపిల్లలు కు హార్ట్ ఆపరేషన్స్ పాలు సేవాకార్యక్రమాలు చేస్తూ వారి పాలిట దేవుడయ్యాడు. మహేష్ ముద్దల తనయ సితార కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తుంది..

మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తున్నారు.. ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువమందికి తెలిసి.. వారు కూడా సహాయం పొందేలా.. ఓ స్పెషల్ వెబ్ సైట్ ప్రారంభించారు. ఇక ఈ విషయాన్ని మహేష్ తనయ సితార అధికారకంగా ప్రకటించడంతో పాటు.. ఆ ఫౌండేషన్ కి తన వంతు సాయంగా సితార తన పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది.. దాంతో ఈ పోస్ట్ పై నెటిజన్స్ సితారపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో సితార పాప కి ఇంత మంచి మనసు ఉంటే ఇక పెద్దయ్యాక మహేష్ ను మించి పోతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.