సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. తమిళ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ సినిమా విడుదలయ్యి పది రోజులు కాకముందే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం జరిగింది. పూర్తి ఓవరాల్ రన్ టైంలో వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
సినిమాలో అనిరుద్ అందించిన మ్యూజిక్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం సినిమాని ఓ రేంజ్ లో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయేలా చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా “జైలర్” సక్సెస్ మీట్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తావన వచ్చిన సమయంలో రజినీకాంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారట.
సౌత్ సినిమాల హవా కొనసాగుతూ ఉండటంతో.. సౌత్ ఇండియా ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే కొడుకు లేరన్న బాధ కలుగుతుందని తలైవా అన్నారంట. తారక్ నీ చూస్తుంటే మనసులో తెలియని ఒక ఆనందం. చాలా సహజత్వమైన ముఖం కలిగిన వాడు. ఇంకా నటనలో తారక్ విశ్వరూపం చూపిస్తాడు. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్ర మాత్రమే ప్రేక్షకులను చూసేలా నటనతో మెప్పిస్తాడు. ఈ రకంగా తారక్ నటన గురించి “జైలర్” సక్సెస్ మీట్ లో రజనీకాంత్ పొగడ్తల వర్షం కురిపించారట.