ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అలమూరులో ఆర్టీసీ బస్సులో సామాన్యుడిలా చంద్రబాబు పర్యటించడం జరిగింది. కండక్టర్ దగ్గర టికెట్ కొనుక్కొని ఆర్టీసీ బస్సులో కూర్చుని బస్సులో ఉన్న మహిళలను ఇంకా మిగతా ప్రయాణికులను వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం ఇంకా ప్రభుత్వ పన్నులపై అదేవిధంగా కరెంటు బిల్లులు వేళల్లో రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధలు విన్న చంద్రబాబు ఓదార్చడం జరిగింది. అనంతరం మొదటి విడత టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన పథకాలు గురించి చంద్రబాబు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రయాణం ఫ్రీ ఇంకా మహాశక్తి పథకం వంటి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ అనే పథకంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
కోనసీమ ప్రాంతంలో చంద్రబాబు పర్యటనలో రైతుల సమస్యల గురించి ఇంకా సర్పంచుల నిధుల గురించి వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇంక ఇదే పర్యటనలో అక్రమ ఇసుక తవ్వకాలు గురించి కూడా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. చంద్రబాబు ఇటీవల కోనసీమ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.