ఆగస్టు 17వ తారీకు నుండి శ్రావణమాసం మొదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 15 వరకు ఈ శ్రావణమాసం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలా పుణ్యాలు సంపాదించుకోవచ్చు అని పండితులు చెప్పవస్తున్నారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ద్వారా ఆమె కటాక్షం అందుకుని ఆర్థిక సమస్యల నుండి ఈ శ్రావణమాసంలో విముక్తి పొందే అవకాశం ఉందట.
పెళ్లయిన స్త్రీలు ఈ శ్రావణమాసం మొత్తం ఉదయం లేచి తలస్నానం చేసి ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని.. అమ్మవారి మాదిరిగా అలంకరించుకొని.. ప్రత్యేకమైన దుస్తులు వేసుకోవడం మంచిదట. అంతేకాదు ఇంటి ముందు ముగ్గులు వేసుకుని అలంకరించుకోవాలట. ఇలా చేయడం ద్వారా అనేక ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందచ్చట. పూజ గదిలో పరిశుభ్రంగా అన్ని వస్తువులు అమర్చి పూజలు చేయడం ఇంకా కొత్త వస్తువులు.. పెట్టడం.. దీపారాధన వంటివి చేయటం ద్వారా కూడా వరలక్ష్మి అనుగ్రహం పొందుకోవచ్చట.
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంట్లో ఇల్లాలు పవిత్రమైన స్నానం చేసి దీపారాధన చేయటం మంచిదట. ఇదిలా ఉంటే ఈ శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజు నాడు బీరువాలో.. ఒక ఎర్రని వస్త్రం తీసుకొని దానిలో ఐదు పసుపు గవ్వలు, ఒక రూపాయి నాణేలు 5.. పసుపు కుంకుమలతో పాటు అక్షింతలు తీసుకుని వాటితో పెట్టి చుట్టి ఒక మూటలాగా కట్టేయాలంట. ఆ మూటను సాంబ్రాణి దీపానికి చూపించి.. ఆ ఎర్రని మూటను బీరువాలో పేట్టి ఇలా చేయడం వల్ల.. ఆర్థిక బాధలు తొలగిపోవడం మాత్రమే కాదు ఆగిపోయిన పనులు సైతం మళ్లీ కొనసాగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.