Prabhas Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న సినిమా ప్రాజెక్ట్ కేె. ఈ భారీ వైవిధ్యమైన సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది.. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
ఇంతకీ ఆ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ప్రాజెక్ట్ కేె సినిమా నైజాం హక్కులను ఆసియన్ సునీల్ సారథ్యంలోని సిండికేట్ దక్కించుకుంది. సుమారు 70 కోట్లకు కాస్త అటుఇటుగా నైజాం హక్కుల పంపిణీని ఈ సిండికేట్ కైవసం చేసుకుంది. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నిర్మాతలు, సురేష్ బాబు, సునీల్ తో కలిసి ఆసియన్ గ్లోబల్ అనే పంపిణీ సిండికేట్ ను స్టార్ట్ చేసారు. సీతారామం, కార్తికేయ 2, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్లను ఈ సిండికేట్ రిలీజ్ చేసింది.
ఇప్పుడు ఇదే సిండికేట్ కు ప్రాజెక్ట్ కే హక్కులు కూడా దక్కాయి. ఒక్క నైజాం నే 70 కోట్లు అంటే ఆంధ్ర, సీడెడ్ ఏ మేరకు వుంటాయో అంచనా వేసుకోవచ్చు.. ఈ విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ కే కి అన్ని కోట్లు వచ్చాయా అని రాజమౌళి బిత్తరపోయాడట..