Prabhas : ప్రభాస్ ఎపిసోడ్ ముందుగా రిలీజ్ చేయడానికి ఇంత పెద్ద మ్యాటర్ ఉందా.!?

Prabhas :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలకృష్ణ హౌస్ కి వ్యవహరిస్తున్న అండ్ స్టాపబుల్ షో కి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నట్టు.. మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ఆహా టీం నిన్న అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ను ఈరోజు రాత్రి 9 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది..

Prabhas unstoppable 2 first episode release today 9pm
Prabhas unstoppable 2 first episode release today 9pm

ఇంతలోనే ఇంత పెద్ద మార్పు జరగడానికి కారణం ఏంటని అంతా అనుకుంటుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రేపటి ఎపిసోడ్ ను ఈరోజు రాత్రికి విడుదల చేయమని నిన్నటి నుంచి ఆహా టీం ను రిక్వెస్ట్ చేశారట.. ఆహా టీం కి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఎన్నో మెయిల్స్ వచ్చాయని.. అలాగే పర్సనల్ గా చాలా కాల్స్ వచ్చాయని.. వాట్సాప్ లో మెసేజ్లు ఇలా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రభాస్ మొదటి ఎపిసోడ్ ను ఈరోజు రాత్రికి విడుదల చేయనున్నట్లు ఆహా టీం ప్రకటించింది.

మొత్తానికి ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈరోజు రాత్రి 9 ఎప్పుడు అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ రామ్ చరణ్ ఫోన్లలో ఏం మాట్లాడుకున్నారు. అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరుగుతుందా లేదా అనే మ్యాటర్స్ రివిల్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.