Prabhas : పండగ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చిన మారుతి..!

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. మారుతి ముందుగానే ఈ సినిమాలో పాత ప్రభాస్ ని తాను చూపిస్తానని చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ ను మారుతి వింటేజ్ లుక్ లో కనిపించేలా చేయనున్నాడు.. వింటేజ్ ట్రీట్ డెఫినెట్ గా ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

Prabhas maruti combination movie one picture viral on social media
Prabhas maruti combination movie one picture viral on social media

మారుతి సెట్స్ లో ప్రభాస్ లుక్ రివిల్ అయింది. ఈ ఫోటో చూస్తే వింటేజ్ ప్రభాస్ గుర్తు రాక మానడు. దీనితో అయితే ఫ్యాన్స్ కి డెఫినెట్ గా మంచి ట్రీట్ ప్రభాస్ లుక్స్ అండ్ ఎనర్జీ పరంగా దొరికే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈపిక్ లో ప్రభాస్ పాత లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇవ్వాలని మారుతీ సెట్స్ నుంచి కావాలని ఇలా ఫోటోలు లీక్ చేశారని కొంతమంది నేటిజన్స్ అంటున్నారు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పెట్టినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని హార్రర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు మారుతి..