Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్నవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే.. వరుస సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.. ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదని జ్వరం వచ్చినట్లు వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న అనుష్క ప్రభాస్ కోసం ఏం చేసిందంటే.!?
ప్రభాస్ వరుస సినిమా షూటింగ్లలో పడి అలసిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా మూడు సినిమాల షూటింగ్కు వెంట వెంటనే హాజరు అవ్వడం దీనికి ముఖ్య కారణమని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తల్లి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టమని ప్రభాస్ కి సూచించినట్లుగా సమాచారం . ఈ క్రమంలోని ప్రభాస్ కి జోడీగా అనుష్క అయితే బాగుంటుందని ఎప్పటినుంచో టాలీవుడ్ సర్కిల్స్ ఓ న్యూస్ వినిపిస్తోంది.
అనుష్క ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి ప్రభాస్ ఆరోగ్యం బాగుండాలని ఇంట్లోనే పూజలు చేస్తుందని తెలుస్తోంది. ఈ విషయం వారి కామన్ ఫ్రెండ్ ద్వారా బయటకు వచ్చింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అనుష్క ప్రభాస్ ఆరోగ్యం కోసం ఉపవాసం కూడా ఉంటుందని తెలుస్తుంది.
ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా కోల్కొని మళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని తన ఆరోగ్యం బాగుండాలని.. అనుష్క ప్రభాస్ కోసం పూజలు చేస్తుందని.. అందుకోసం కఠినమైన నియమాలను కూడా పాటిస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బయట పెట్టకపోయినప్పటికీ అనుష్క ప్రభాస్ గురించి ఇలా చేయడంతో.. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని మరోసారి బయటపడింది. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.