Taraka Ratna టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో.. ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. తారకరత్న హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సలు అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నందమూరి తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే..
తారకరత్న ఆసుపత్రిపాలై రెండు వారాలు గడిచిపోయింది. మూడు నాలుగు రోజులు హడావుడి చేసిన కుటుంబ సభ్యులు, మీడియా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వారం రోజులుగా తారకరత్న ఆరోగ్యం పై ఎలాంటి అప్డేట్ లేదు. కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కాని ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దాంతో ఫాన్స్ లో అయోమయం నెలకొంది.. తారకరత్న కోరుకుంటున్నాడు కాబట్టి నందమూరి ఫ్యామిలీ రిలాక్స్ అయ్యారా.. లేక ఇంకేమైనా కారణం ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి..
తారకరత్న ఆరోగ్యం పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిందే చివరి అప్డేట్.. లివర్, గుండె, కిడ్నీ సాధారణ స్థాయికి చేరాయి. రక్తప్రసరణ మెరుగైనది. కొన్ని నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ జరగకపోవడంతో మెదడు పై భాగంలో సమస్య ఏర్పడింది. త్వరలోనే అది కూడా మెరుగవుతుందని చెప్పారు. ఆ తరువాత బెటర్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకువెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి..
రోజులు గడుస్తున్నా మరో అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు నందమూరి తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీ తారకరత్నను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య కండిషన్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. తారకరత్న అభిమానులు మాత్రం ఆయన కోలుకుంటారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా తారకరత్న ఆరోగ్యం కోసం ఖర్చు చేసినట్లు సమాచారం.