Nandamuri Heros : నందమూరి ఫ్యామిలీ కి మాత్రమే సాధ్యమైన సెన్సేషనల్ వరల్డ్ రికార్డ్ ఇది – ఎవ్వడి వల్లా కాదు !

Nandamuri Heros :  టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉందన్న సంగతి తెలిసిందే.. నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుతం మూడోతరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా దూసుకెళ్తున్నారు. ఇక అందరూ హీరోలు కూడా తమదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.. ఇప్పటివరకు మిగతా ఏ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేయని అరుదైన రికార్డును.. నందమూరి హీరోలకు మాత్రమే సొంతమైన ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

this-sensational-record-have-only-nandamuri-heros
this-sensational-record-have-only-nandamuri-heros

నందమూరి తారక రామారావు దానవీరశూరకర్ణ సినిమాలో దుర్యోధనుడిగా.. కృష్ణుడిగా.. కర్ణుడిగా నటించి మూడు పాత్రలకు ప్రాణం పోసి అనూహ్యమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఓకే సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు.. ఆయన నటన పుణికి పుచ్చుకున్న ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా త్రిపాత్రాభినయం చేశారు..

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ తరం హీరోలలో ఏ హీరో చేయని విధంగా త్రిపాత్రాభినయం చేశారు.. జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు పాత్రలో నటించి జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు అనడంలో సందేహమే లేదు..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ చిత్రం అమీగోస్.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా త్రిపాత్రాభినయం చేశారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు త్రిపాత్రాభినయం చేసే సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారని చెప్పాలి.