Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో తన పేరుని వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోయేలా చేశారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియావే.. ఇటీవల ప్రభాస్ అనారోగ్యానికి గురయ్యారు అని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది.. కాగా మళ్లీ ప్రభాస్ ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియా కోడై కోస్తోంది.. అందుకు ఈ అలవాట్లే కారణం అంటూ సరికొత్త ప్రచారం తెర పైకి తీసుకువచ్చారు సోషల్ మీడియా గాసిప్ రాయుళ్లు..
ప్రభాస్ చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పేట్టి మరి తను ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.. చూడటానికి ఫిట్ గా ఉండే ప్రభాస్ కి ఏం బాగోలేకపోవడం ఏంటి అని అంతా ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ కి హెల్త్ పరంగా సీరియస్ ఇష్యూస్ ఏం లేవని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఉన్న అన్ని నాళ్లు గట్టిగా ధిట్టగా స్ట్రాంగ్ గా ఉన్న ప్రభాస్.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళారో.. అప్పటినుంచి డైటింగ్ , ఫిజికల్ ఎక్స్ సర్సైజ్ లు అంటూ తనకి పడనని వన్ని చేస్తున్నారని సమాచారం.
అందువలనే ప్రభాస్ ఫేసులో చలా మార్పులు వచ్చాయి. అయన లుక్స్ కూడా తేలిపోయాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రభాస్ మంచిగా తింటడంట. కాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళినప్పటి నుంచి ప్రభాస్ ఫుల్ డైట్ కంట్రోల్ చేయడంతో లేనిపోని తిప్పలు తెచ్చుకున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఎప్పుడు ఇష్టంగా తీసుకునే ఆహారాలను కాకుండా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత కొత్త డైట్ మెయింటైన్ చేస్తున్నాడు. దాంతో తన ఆరోగ్యం పాడవడంతో పాటు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లుక్స్ తో పాటు మరికొన్ని చేంజ్ చేసి దీన్ని కారణంగానే ప్రభాస్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని టాక్ వినిపిస్తోంది.. ప్రభాస్ టీం త్వరగా స్పందించి ఈ వార్తలకు చెక్ పెడితే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.