Nagma.. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ లక్షలకు లక్షలు కాజేస్తూ ఉంటారు. ముఖ్యంగా డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.అయితే ఇప్పుడు అన్నీ తెలిసి కూడా హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది. తన ఫోన్ కి వచ్చిన ఒక మెసేజ్ క్లిక్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు నగ్మా .
ఫిబ్రవరి 28న మొబైల్ కి బ్యాంకు వాళ్ళు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది.అందులో భాగంగానే బ్యాంక్ ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్న ఆ మోసగాడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను కేవైసీ కంప్లీట్ చేయమని చెప్పాడు.. ఎటువంటి బ్యాంకు డీటెయిల్స్ షేర్ చేయకపోయినా సరే ఆ నేరగాడు ఆమె బ్యాంక్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాడు. బెనిఫిషరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని .. రూ.99,998 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. వెంటనే అప్రమత్తమైన ఈమె తాను మోసపోయానని తెలుసుకుంది.. కానీ లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు బాధలో కూడా సంతోషం వ్యక్తం చేసింది నగ్మా.