Poorna: పూర్ణ ప్రత్యేకంగా పరిచయం చెప్పనక్కర్లేదు.. సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల పూర్ణ దుబాయ్ చెందిన బిజినెస్ మ్యాన్ ఆసిఫ్ అలీ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సంవత్సరం తిరగక ముందే పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది.. పూర్ణకు సీమంతం కూడా చేశారు.. కానీ..
ఇటీవల పూర్ణ శ్రీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇక బేబీ బంప్ తో పూర్ణ ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్ణ శ్రీమంతానికి తన బంధు మిత్రులందరు హాజరయ్యారు. అలాగే బుల్లితెర సెలబ్రిటీలు కూడా పూర్ణ శ్రీమంతం వేడుకల్లో పాల్గొని సందడి చేశారు..
కాకపోతే పూర్ణ శ్రీమంతానికి వెండి తెర సెలబ్రిటీస్ ఎవ్వరూ హాజరు కాలేదు. బుల్లితెర సెలబ్రిటీలు తప్ప వెండితెర నటీనటులు ఎవరూ రాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పూర్ణ తన శ్రీమంతానికి టాలీవుడ్ సెలబ్రిటీలను ఎవరిని పిలవలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి పూర్ణ ఎందుకు ఇలా ఎవరిని పిలవకుండా శ్రీమంతం చేసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే పూర్ణ శ్రీమంతాం వేడుకలకు తనకు అత్యంత సన్నిహితులైన ఆమె బంధువు ఒకరు రాలేదట. దాంతో పూర్ణ తన శ్రీమంతం వేడుకల్లో చిన్న బుచ్చుకుందట. అని వారి సన్నిహితుల వర్గాల వారి వారి నుంచి అందుతున్న సమాచారం.
పూర్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ చిత్రం సువర్ణసుందరి.. పూర్ణ నటించిన సువర్ణ సుందరి రియన్ కర్నేషన్ సబ్జెక్టు రోలర్ కోస్టర్ స్క్రీన్ ప్లే తో మినిట్ బై మినిట్ ఆడియన్స్ కి మంచి థ్రిల్లర్ ని ఇస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకులు ముందుకు రానుంది.