Taraka Ratna: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో.. ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. తారకరత్న హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సలు అందిస్తున్న వైద్యులు తెలిపారు.. గుండెలో కుడి ఎడమవైపు 95 శాతం బాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.. ఇప్పటికే నందమూరి తారక రత్న ను చూడటానికి పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి వెళ్తారు.. నందమూరి తారక రత్న హాస్పిటల్ కు మహేష్ తోపాటు ఆయన ఫ్యామిలీ కూడా అక్కడికి చేసుకోనున్నారని సమాచారం.

నందమూరి హీరో తారకరత్న ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఆ సందేహాలకు తెర దించుతూ తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ చేశారు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో తారకరత్నా పలు చిత్రాల్లో విలన్‌గా చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.
తారక రత్న కి మహేష్ బాబు మధ్య సాన్నిహిత్యం ఉంది. తరచూ వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అంతెందుకు మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 28 సినిమాలో తారకరత్న విలన్ గా నటిస్తున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబు ప్రస్తుతం ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నందమూరి తారక రత్న ను పరామర్శించాడానికి.. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడనికి మహేష్ తన కుటుంబంతో పాటు కలిసి వెళ్లనున్నారట.
మహేష్ బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేరుకోనున్ననట్లు సమాచారం. అక్కడే కాసేపు ఉండి మహేష్ వైద్యులను అడిగి తారక రత్న ఆరోగ్య పరిస్తితి గురించి తెలుసుకొనున్నారు. తారకరత్న త్వరగా కోలుకోని మహేష్ త్రివిక్రమ్ షూటింగ్ లో పాల్గొనాలని మహేష్ ఫ్యాన్స్ కూడా ప్రార్థనలు చేస్తున్నారు.