Union Budget 2023 : 2023 – 24 ఆర్థిక సంవత్సారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అమృత్ కాలానికి ఇది తొలి పద్దు అని వెల్లడించారు. సప్తర్షి విధానంలోనే బడ్జెట్ ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా రైతులకు కేంద్రం తీపి కబురు తెలిపింది.
రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్య శాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్.. పీఏం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ.6 కోట్లు కేటాయిస్తామన్నారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగులు నిర్మిస్తామని ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో వరుసగా ఐదోసారి ఆమె లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. 2019లో మోదీ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రి అయ్యిరు నిర్మలమ్మ.
అప్పటినుంచి ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే అంతకుముందు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఐదుగురు ఉన్నారు. అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఈ జాబితాలో ఉన్నారు.