Union budget 2023 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్ వరుసగా ఐదోసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు నిర్మల సీతారామన్.. అయితే ఈ బడ్జెట్ తో ఏ వస్తువులు చౌకగా లభించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ 2023ని ప్రవేశపెట్టారు. సీతారామన్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. దాంతో
మొబైల్ ఫోన్లు, లిథియం బ్యాటరీలు, వజ్రాల తయారీలో ఉపయోగించే వస్తువుల పై కస్టమ్స్ పన్ను తగ్గించబడింది.. ఈ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రొయ్యల మేతపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది.
మునుపటి రేట్లతో పోలిస్తే మొబైల్ ఫోన్లు రెట్లు మరింత తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్స్ కొనాలి అనుకునేవారికి కచ్చితంగా ఇది గుడ్ న్యూస్.. ఈ కొత్త బడ్జెట్ అమలు చేసిన రోజు నుంచి మొబైల్ ఫోన్స్ కొనుకుంటే వాటి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రిక్ బైక్స్ కూడా తక్కువ ధరకే రానున్నాయి. లిథియం బ్యాటరీలు ధరలు తగ్గాయి. దాంతో వారికి కూడా ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ తో సిగరెట్లు, బట్టలు, రబ్బరు రెట్లు మరింత పెరగనున్నాయి.