Sree Leela : పూజ హెగ్డే కి ఎసరు పెట్టిన శ్రీ లీల..

Sri Leela: పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల.. రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. రవితేజ కెరీర్ లో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.. దాంతో ఈ అమ్మడిని బాక్సాఫీస్ దేవతగా కొలుస్తున్నారు. ఈ అమ్మడు అందం అభినయంతో పాటు కూడా అద్భుతంగా చేస్తుంది.. దాంతో ఈ అమ్మడుని యంగ్ హీరోలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు..

Pooja Hegde palce replacement on Sree Leela
Pooja Hegde palce replacement on Sree Leela

ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నటించబోతున్న శ్రీలీల, రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. SSMB28 సినిమాలో కూడా శ్రీలీల నటిస్తుంది.

మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమా లో పూజా హెగ్డ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఈమె తోపాటు స్క్రీన్ షేర్ చేసుకోనున్న శ్రీ లీలను మరో సినిమాలో ఆమె స్థానాన్ని రీప్లేస్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందించనున్న ఉస్తాద్ భగత్ సింగ్లో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను తీసుకోనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ కూడా చేసినట్లు టాక్.

ఈ చిత్రానికి ముందు పూజానే కథానాయికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా ఎంతకీ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో పూజ తప్పుకుంది. ఇప్పుడు తన స్థానాన్ని శ్రీలీలతో భర్తీ చేయాలని హరీష్ చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబో లో మల్టీ స్టారర్ గా రానున్న వినోదియ సిత్తం రీమేక్ లో శ్రీలీల ఒక పాట చేయనుంది.