Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో అనీ అందరికీ తెలుసు. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడంలో పవన్ కళ్యాణ్ మార్కెట్ వేరు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓపెనింగ్స్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వస్తాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా యువతను ప్రభావితం చేస్తున్న హీరోగా తిరుగులేని క్రేజ్ ఉన్న పవన్ మరో పక్క రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో… అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు రెడీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తారీకు OG సినిమా నుండి టీజర్ రిలీజ్ చేస్తున్నారట, అంతేకాదు ఇదే సినిమాకి సంబంధించి ఆగస్టు 28వ తారీకు పోస్టర్ రిలీజ్ చేస్తున్నారట.
ఇంకా సెప్టెంబర్ రెండవ తారీకు “గుడుంబా శంకర్” రీ రిలీజ్ కానుందట. ఇక అదే రోజు హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి కూడా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఆగస్టు 8 వ తారీకు నుండి మొదలయ్యి ఐదు రోజులు ఫుల్ మీల్స్ ఉండే రీతిలో బ్యాక్ టు బ్యాక్ కొత్త సినిమాల అప్ డేట్స్ ఇచ్చే రీతిలో మేకర్స్ రెడీ అయ్యారట. దీంతో ఈసారి పవన్ జన్మదిన వేడుకలకు సంబంధించి సోషల్ మీడియా షేక్ అవటం గ్యారెంటీ అని నెటిజెన్స్ అంటున్నారు.