Khushi: “ఖుషి” సినీ ప్రమోషన్ కార్యక్రమంలో బాలకృష్ణ పై విజయ్ దేవరకొండ పొగడ్తలు..!!

Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. “అర్జున్ రెడ్డి” తర్వాత ఒక్కసారిగా కెరియర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత గీతాగోవిందం వంటి రొమాంటిక్ హిట్ కొట్టి అమ్మాయిలలో క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గత కొద్ది సంవత్సరాల నుండి హిట్ కొట్టడానికి లబోదిబోమంటున్నాడు.

గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన “లైగార్” కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కెరీర్ పరంగా కలిసి వచ్చిన ప్రేమ కథ సినిమా జోనర్ నమ్ముకుని ప్రస్తుతం శివానిర్వాన దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్.

Vijay Devarakonda praises Balakrishna at "Khushi" movie promotion event

ఇదంతా పక్కన పెడితే తాజాగా “ఖుషి” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నటసింహం నందమూరి బాలయ్య పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మాట్లాడుతూ..”బాలకృష్ణ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తన లైఫ్ నీ చిన్నపిల్లాడిలా గడిపేస్తుంటారు. బాలయ్య బాబుతో నాకు రాపో సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. బాలకృష్ణలో నేను ఎప్పుడు సెకండ్ షేడ్ చూడలేదు..అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ పై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.